తెలంగాణ

telangana

ETV Bharat / state

'మల్టీ ఆర్గాన్స్​ ఫెయిల్యూర్​ అయితే తప్ప కరోనాతో ప్రమాదం లేదు' - గాంధీ ఆసుపత్రి

యుక్త వయస్సు వారిలో కరోనా అంత ప్రభావం చూపదని గాంధీ ఆసుపత్రి జనరల్​ మెడిసిన్​ విభాగం ప్రొఫెసర్​ డాక్టర్​ రాజారావు తెలిపారు. ఇన్ఫర్మేషన్​ అండ్​ పబ్లిక్​ రిలేషన్​ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో యశోద ఆసుపత్రి సీనియర్​ డాక్టర్​ ఎంవీ రావుతో కలిసి ఆయన కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.​

awareness program to the people on corona at Hyderabad
'మల్టీ ఆర్గాన్స్​ ఫెయిల్యూర్​ అయితే తప్ప కరోనాతో ప్రమాదం లేదు'

By

Published : Apr 2, 2020, 9:01 AM IST

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్​మెంట్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా గాంధీ ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాజారావు, యశోద ఆసుపత్రి సీనియర్ డాక్టర్ ఎంవీ రావు ప్రజలకు కరోనా నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చేతులను పరిశుభ్ర పరచుకోవడం సహా... లక్షణాలు ఉన్నవారు తప్పక వైద్యులను సంప్రదించాలని సూచించారు. గాంధీలో 200 మంది ఐసోలేషన్​లో ఉన్నారని... 69 మంది ప్రస్తుతం కరోనాకి చికిత్స పొందుతున్నారని డాక్టర్ రాజారావు వివరించారు. కరోనా సోకిన వారిలో కూడా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయితే తప్ప ఎలాంటి ప్రమాదం లేదని.. యుక్త వయస్సు వారిలో ఇది అంత ప్రమాదకరం కాదని పేర్కొన్నారు.

'మల్టీ ఆర్గాన్స్​ ఫెయిల్యూర్​ అయితే తప్ప కరోనాతో ప్రమాదం లేదు'

ABOUT THE AUTHOR

...view details