తెలంగాణ

telangana

ETV Bharat / state

Awareness on Omicron : ఒమిక్రాన్​పై అవగాహన కల్పిస్తూ సియా లైఫ్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో 3కే నడక

Awareness on Omicron : కొవిడ్​ మహమ్మారి కారణంగా రెండేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలు మరోసారి రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సియా లైఫ్ ఆస్పత్రి​ డైరెక్టర్​ డాక్టర్​ మనీంద్ర అన్నారు. హైదరాబాద్​ కొండాపూర్​లో సియా లైఫ్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఒమిక్రాన్​ వేరియంట్​పై అవగాహన నడక నిర్వహించారు.

By

Published : Dec 12, 2021, 11:15 AM IST

Updated : Dec 12, 2021, 2:05 PM IST

Sia Life Hospital
Sia Life Hospital

Awareness on Omicron : హైదరాబాద్​ కొండాపూర్​లో సియా లైఫ్​ ఆస్పత్రి ఆధ్వర్వంలో ఒమిక్రాన్​ వేరియంట్​పై అవగాహన నడక నిర్వహించారు. మహమ్మారి కట్టడికి ప్రతి ఒక్కరు కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. మాస్క్​ ధరించాలని సూచిస్తూ.. రాఘవేంద్ర కాలనీవాసులతో కలిసి ఆస్పత్రి సిబ్బంది 3కే వాక్ నిర్వహించారు. కొండాపూర్​ రాఘవేంద్ర కాలనీ నుంచి రాజరాజేశ్వరీ కాలనీవరకు ఈ నడక సాగింది.

Omicron Variant : రోజుకోరకంగా రూపం మార్చుకుని ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్న కొవిడ్​ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని సియా లైఫ్​ ఆస్పత్రి డైరెక్టర్​ డాక్టర్​ మనీంద్ర తెలిపారు. ప్రతి ఒక్కరు కొవిడ్​ నిబంధనలు పాటించడమే కాకుండా.. వ్యాక్సిన్​ తీసుకోవాలని సూచించారు.

గర్భిణులు అవగాహన లేకపోవడం వల్ల వ్యాక్సిన్​ తీసుకోవడం లేదని.. గర్భవతులు కూడా వ్యాక్సిన్​ తీసుకోవాలని సియా లైఫ్​ ఆస్పత్రి వైద్యురాలు సాహిత్య అన్నారు.

ఒమిక్రాన్​పై అవగాహన కల్పిస్తూ సియా లైఫ్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో 3కే నడక

ఇదీ చూడండి:'ఒమిక్రాన్‌' వేళ.. భారత్‌కు ఊరటనిచ్చే వార్త!

Last Updated : Dec 12, 2021, 2:05 PM IST

ABOUT THE AUTHOR

...view details