రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్టు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ట్రాఫిక్ పోలీసు విభాగం చేపడుతున్న చర్యల వల్ల 25 శాతం రహదారి ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. వాహనదారులు వందశాతం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. యువతలో నిబంధనలపై మరింత అవగాహన కల్పించేలా ట్రాఫిక్ పోలీసులు కార్యక్రమాలు చేపట్టాలని అంజనీకుమార్ సూచించారు. ఏళ్ల తరబడి రహదారులపై నిబంధనలు పాటిస్తూ, ఎటువంటి జరిమానాలు లేకుండా తిరుగుతున్న వాహనదారులకు మెక్‌డొనాల్డ్ సంస్థకు చెందిన గిఫ్ట్ కూపన్లు, బొకేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెక్‌డొనాల్డ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
'సమష్టి కృషితోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం' - latest news of traffic awareness by cp
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. సమష్టి కృషితోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమని చెప్పారు.
!['సమష్టి కృషితోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5049644-753-5049644-1573637226258.jpg)
' యువతలో ట్రాఫిక్నియమాలపై అవగాహనతో రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చు'
'యువతలో ట్రాఫిక్నియమాలపై అవగాహనతో రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చు'
ఇదీ చూడండి: రాళ్లు రువ్వటం వల్లే... లాఠీ ఛార్జీ: సీపీ