తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన - జాతీయరోడ్డు భద్రతా మాసోత్సవాలు

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా హైదరాబాద్​లో వాహనదారులకు పోలీసులు, విద్యార్థులు అవగాహన కల్పించారు. రోడ్డుదాటే సమయంలో.. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలో నాటకం ప్రదర్శించి వివరించారు.

Awareness for motorists as part of National Road Safety Month
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన

By

Published : Feb 14, 2021, 5:12 PM IST

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్‌ బేగంపేటలోని ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఇందుకోసం రోడ్డు పైనే డ్రామాను ప్రదర్శించారు.

రోడుపై జరిగే ప్రమాదాలను నుంచి ప్రజలను ఏ విధంగా కాపాడాలి అనే అంశంపై విద్యార్థులతో అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. రోడ్డుపై ఎలా నడవాలి.. జీబ్రా క్రాసింగ్​ను దాటే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చిన్న చిన్న నాటకాలు, నృత్యాల ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బేగంపేట ట్రాఫిక్‌ పోలీసు సీఐ అరలప్పా, ఇన్స్‌పెక్టర్‌, ట్రాఫిక్‌ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:షేక్‌పేటలో విషాదఛాయలు.. స్వస్థలానికి అరకు మృతదేహాలు

ABOUT THE AUTHOR

...view details