తెలంగాణ

telangana

ETV Bharat / state

రాచకొండ కమినరేట్ పరిధిలో సిబ్బంది అవార్డుల మేళా - Awards for Telangana Police

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో మార్చి నుంచి ఇప్పటివరకు 62 కీలకమైన కేసుల్లో నిందితులను జైలుకు పంపినట్లు అదనపు డీజీ జితేందర్‌ తెలిపారు. కేసుల అవార్డు మేళాలో పాల్గొన్న డీజీ.. వివిధ కేసులకు సంబంధించి సాక్ష్యాలు సేకరించిన పలువురు పోలీసులు, కోర్టు సిబ్బందికి అవార్డులు అందించారు.

రాచకొండ పరిధిలో కేసుల కన్విక్షన్‌ మేళా... పోలీసులకు అవార్డులు
రాచకొండ పరిధిలో కేసుల కన్విక్షన్‌ మేళా... పోలీసులకు అవార్డులు

By

Published : Dec 17, 2020, 12:58 PM IST

దేశంలోనే అత్యంత వేగంగా ఆర్థికంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందని.. అందుకు ఇక్కడి శాంతి భద్రతలు అదుపులో ఉండటమే కారణమని అదనపు డీజీ జితేందర్​ అన్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో కేసులు పరిష్కరించిన సిబ్బందికై ఏర్పాటు చేసిన అవార్డు మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కేసులు తేల్చిన పోలీసులు, కోర్టు సిబ్బందికి అవార్డులు

పలు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా సాక్ష్యాలు సేకరించి కోర్టుకు సమర్పించిన పలువురు పోలీసు, కోర్టు సిబ్బందికి ఆయన ఆవార్డులు అందజేశారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 62 కీలక కేసుల్లో 89 మంది నిందితులను జైలుకు పంపినట్టు ఆయన తెలిపారు. కేసుల్లో జీవిత ఖైదుతో పాటు ఇరవై ఏళ్ల జెలు శిక్ష పడిదంటే ఇందులో పోలీసుల నిబద్దత శ్రమ అర్ధమవుతుందని తెలంగాణ ప్రాసిక్యూషన్‌ విభాగం సంచాలకురాలు వైజయంతి అన్నారు. 62 కేసుల్లో నిందితులకు శిక్షలు పడడమంటే మామూలు విషయం కాదన్నారు. నిందితులకు శిక్ష పడేలా చేసినప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతోందని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ అన్నారు.

ఇవీ చూడండి:వీల్​ స్పిన్​తో ఆఫర్లు... ఆడారో ఖాళీ అవుతాయి మీ అకౌంట్లు

ABOUT THE AUTHOR

...view details