హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. నూతన సంవత్సరం వచ్చిందంటే హైదరాబాద్‌లో గుర్తుకొచ్చేది నుమాయిషేనని హరీశ్ రావు అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న వస్తువులు ఇక్కడ దొరుకుతాయన్నారు.
ఘనంగా నుమాయిష్ అవార్డుల ప్రదానోత్సవం - ఆర్థిక మంత్రి హరీశ్ రావు
నూతన సంవత్సరం వచ్చిందంటే హైదరాబాద్‌లో గుర్తుకొచ్చేది నుమాయిషేనని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవానికి హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి హాజరయ్యారు.
నుమాయిష్ అవార్డుల ప్రదానోత్సవం
మరో మూడు రోజుల్లో నుమాయిష్ ముగియనుండటంతో స్టాల్ నిర్వహణలో ప్రతిభ కనబరిచిన నిర్వాహకులకు బహుమతులు ప్రదానం చేశారు. నుమాయిష్ అనేది హైదరాబాద్ సంస్కృతికి నిదర్శనమన్నారు మహమూద్ అలీ. ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు.
ఇవీ చూడండి:సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు