తెలంగాణ

telangana

ETV Bharat / state

Aviation Show: సందడిగా సాగిన ఏవియేషన్‌ షో.. విమానాల విన్యాసాలు అదుర్స్​.. - ఏవియేషన్ షో

Aviation Show: హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో నాలుగురోజులు సందడిగా సాగిన ఏవియేషన్ షో విజయవంతంగా ముగిసింది. వాణిజ్య ఒప్పందాలు, భారత్‌లో ఏవియేషన్ సెక్టార్ అభివృద్ధి చర్యలతో ప్రారంభమైన సమిట్‌... సందర్శకుల సందడితో ముగిసింది. ఆదివారం చివరిరోజు కావడంతో బేగంపేట విమానాశ్రయానికి పెద్ద ఎత్తున నగరవాసులు తరలివచ్చి.. విమానాల విన్యాసాలను తిలకించారు.

Aviation Show: సందడిగా సాగిన ఏవియేషన్‌ షో.. విమానాల విన్యాసాలు అదుర్స్​..
Aviation Show: సందడిగా సాగిన ఏవియేషన్‌ షో.. విమానాల విన్యాసాలు అదుర్స్​..

By

Published : Mar 27, 2022, 10:39 PM IST

సందడిగా సాగిన ఏవియేషన్‌ షో.. విమానాల విన్యాసాలు అదుర్స్​..

Aviation Show: హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ప్రతిష్ఠాత్మకంగా సాగిన ఏవియేషన్ సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. తొలి రెండ్రోజులు బోయింగ్, ఎయిర్‌బస్, ప్రాట్ అండ్ విట్నీ, రోల్స్ రాయిస్ వంటి సంస్థల వ్యాపార ఒప్పందాలతో ముగియగా.. చివరి రెండ్రోజులు సందర్శకులకు అనుమతితో సందడి నెలకొంది. నాలుగు రోజుల పాటు సాగిన ఏవియేషన్ షోకు 20కు పైగా దేశాలు, ఎనిమిదికి పైగా రాష్ట్రాల నుంచి 5 వేల మంది బిజినెస్ ప్రతినిధులు, 60 వేల మంది సందర్శకులు తరలివచ్చారు. చివరి రోజు 38 వేల మంది నగరవాసులు విమానాశ్రయానికి రావడంతో ఆ ప్రాంగణమంతా సందర్శకులతో కిటకిటలాడింది.

రన్​వేపై విమానాల సందడి: మొదటి రోజు డజనుకు పైగా విమానాలు రన్‌వేపై సందడి చేయగా.. చివరి రోజు అందులో సగానికి పరిమితమయ్యాయి. ఆదివారం కావడంతో.. సందర్శకులు కుటుంబసభ్యులతో కలిసి ఏవియేషన్‌ షోను తిలకించారు. ప్రధానంగా చిన్నారులు, యువత విమానాల ప్రదర్శన, ఎయిర్ షోను తిలకించటం.. కొత్త అనుభూతినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.

ప్రత్యేకాకర్షణగా నిలిచిన సారంగ్ టీం ఎయిర్‌ షో:సారంగ్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిర్ షో కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎయిర్ ఫోర్స్ బృందం చేసిన విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. చాలా దూరం నుంచి ఎయిర్‌షోను తిలకించేందుకు వచ్చిన అభిమానులకు... బారికేడ్‌ల వరకే అనుమతించడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details