తెలంగాణ

telangana

ETV Bharat / state

అవతార్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అమోఘం - అవతార్ చారిటబుల్ ట్రస్ట్

ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫక్రుద్దీన్ అన్నారు. బోరబండ డివిజన్​ ప్రభుత్వ బాలికల పాఠశాలలో అవతార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్​ను ఆయన ప్రారంభించారు.

Avatar Charitable Trust
సేవా స్ఫూర్తిని చాటుతోన్న... అవతార్ చారిటబుల్ ట్రస్ట్

By

Published : Feb 26, 2020, 7:31 PM IST

సేవా స్ఫూర్తితో అవతార్ చారిటబుల్ ట్రస్ట్ పేద విద్యార్థుల కోసం ఆర్వో ప్లాంట్ స్థాపించడం సంతోషకరమని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫక్రుద్దీన్ అన్నారు. బోరబండ డివిజన్​లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో అవతార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్​ను అవతార్​ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రసాద్ గుప్తాతో కలిసి డిప్యూటీ మేయర్ ప్రారంభించారు. బాలికల హాస్టల్ ప్రాంగణంలో ఆర్వో ప్లాంట్, విద్యుత్​ మోటార్​ను డిప్యూటీ మేయర్ బాబా ప్రారంభించారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్నో సేవ కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్​ఎంసీ తరపున చారిటబుల్ ట్రస్ట్​కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.


ఇదీ చదవండి:
వేములవాడలో రౌడీషీటర్ హత్యసేవా స్ఫూర్తిని చాటుతోన్న... అవతార్ చారిటబుల్ ట్రస్ట్

ABOUT THE AUTHOR

...view details