తెలంగాణ

telangana

ETV Bharat / state

'నా హత్యకు వారే కుట్ర పన్నారు'

తనను హత్య చేసేందుకు ఆంధ్రప్రదేశ్​ మాజీమంత్రి అఖిలప్రియ దంపతులే సుపారీ ఇచ్చినట్టు పోలీసులు చెప్పిన మాటలు విని ఆందోళనకు గురయ్యానని తెదేపా నేత... ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. తనకు అఖిలప్రియ రాజకీయం నేర్పుతుందా..? అని ఆయన ప్రశ్నించారు.

AV Subba Reddy Reveals on his murder attempt plans
'నాపై హత్యకు వారే కుట్ర పన్నారు'

By

Published : Jun 6, 2020, 4:20 PM IST

తనను హత్య చేయించేందుకు​ మాజీమంత్రి భూమా అఖిలప్రియ దంపతులే సుపారీ ఇచ్చినట్టు పోలీసులు చెప్పిన విషయాలు విని షాక్​కు గురయ్యానని ఆంధ్రప్రదేశ్ తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో తన కుమార్తె జస్వంతితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తనపై దాడి జరిగిన తర్వాత రెండున్నర నెలలు మౌనంగా ఉన్నట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

తనకు అఖిలప్రియ రాజకీయం నేర్పుతుందా..? అఖిలప్రియ ముద్దాయి అవునా..? కాదా..? అన్నదే ప్రశ్న అన్నారు. ఆమెపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. తన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఆళ్లగడ్డకు రమ్మంటుందని అన్నారు. తనను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో వారే చెప్పాలని సుబ్బారెడ్డి ప్రశ్నించారు.

అఖిలప్రియ మంత్రిగా ఉన్నప్పటికీ... ఆళ్లగడ్డలోని ప్రజల సమస్యలను తానే పరిష్కరించానని తెలిపారు. తన తండ్రి నాగిరెడ్డి నామినేషన్‌కు వెళ్తున్న సమయంలో ప్రత్యర్థులు దాడులు చేస్తుంటే... అఖిలప్రియను తన భుజాలపై ఎత్తుకెళ్లి కాపాడినట్లు చెప్పారు. చింతకుంట రాంరెడ్డి, మాదం శ్రీనులు వారి మనుషులే కదా...! అవునో..? కాదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మా నాన్న ప్రాణం ఖరీదు రూ.50 లక్షలా?

ఆడపిల్లగా నాన్నలేని పరిస్థితిని ఊహించుకుంటేనే భయంగా ఉందని ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతి అన్నారు. మా నాన్నను దేవుడిచ్చిన మామగా చెప్పుకునే అఖిలప్రియ... ఆయన్ను చంపేందుకు కుట్ర చేసిందని మండిపడ్డారు. అఖిలప్రియ తీరు మహిళలకే సిగ్గుచేటన్నారు. మా నాన్న ప్రాణం ఖరీదు రూ.50 లక్షలా అని ఆమె ప్రశ్నించారు.

'నాపై హత్యకు వారే కుట్ర పన్నారు'

ఇదీ చూడండి :లాక్​డౌన్​ ఎఫెక్ట్​: చతికిల పడిన వ్యాయామం!

ABOUT THE AUTHOR

...view details