తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్టోబర్​ 1 నుంచి ఆటోల బంద్​: తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఐకాస - హైదరాబాద్​ వార్తలు

ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఐకాస విమర్శించింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా... అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక ఆటోల బంద్ చేపట్టనున్నట్లు ఐకాస కన్వీనర్​ అమనుల్లా ఖాన్ చెప్పారు.

అక్టోబర్​ 1 నుంచి ఆటోల బంద్​: తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఐకాస
అక్టోబర్​ 1 నుంచి ఆటోల బంద్​: తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఐకాస

By

Published : Sep 20, 2020, 4:16 PM IST

ఏపీలో ఆటో డ్రైవర్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ వాహన మిత్ర పేరుతో ఇస్తున్న 10 వేల సహాయాన్ని.. తెలంగాణలో కూడా అమలు చేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఐకాస డిమాండ్ చేసింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా... అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక ఆటోల బంద్ చేపట్టనున్నట్లు ఐకాస కన్వీనర్​ అమనుల్లా ఖాన్ తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

గత శుక్రవారం ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆటో డ్రైవర్ చందర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆటో డ్రైవర్లు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని... అందుకోసం అక్టోబర్ 2న ఆత్మహత్యల వ్యతిరేక దినంగా పాటిస్తూ... ఒకరికొకరు చాక్లెట్లు తినిపించుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:ఒక్కడు.. లక్ష మందికి ఆసరా అయ్యాడు!

ABOUT THE AUTHOR

...view details