తెలంగాణ

telangana

ETV Bharat / state

డీజిల్, పెట్రోల్​ను జీఎస్టీలో చేర్చాలని లారీ ఓనర్స్ ధర్నా - lorry Owners protest at hyderabad

డీజిల్, పెట్రోల్ ధరలను జీఎస్టీలో పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్​ చేస్తూ... వనస్థలిపురం ఆటోనగర్​లో ఆటోనగర్ ఇసుక లారీ ఓనర్స్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.

autonagar-sand-lorry-owners-association-protest-for-diesel-and-petrol-should-be-included-in-to-gst
డీజిల్, పెట్రోల్​ను జీఎస్టీలో చేర్చాలని లారీ ఓనర్స్ ధర్నా

By

Published : Jun 20, 2020, 9:19 PM IST

Updated : Jun 20, 2020, 10:58 PM IST

పెట్రోల్​, డీజిల్​ ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తానని చెప్పి... ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నందారెడ్డి విమర్శించారు. డీజిల్, పెట్రోల్ ధరలను జీఎస్టీలోకి పరిధిలోకి తేవాలని డిమాండ్​ చేస్తూ... వనస్థలిపురం ఆటోనగర్​లో విజయవాడ జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ప్రభుత్వలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.... రహదారిపై బైఠాయించడం వల్ల ట్రాఫిక్ స్తంభించింది.

కరోనాతో దేశంలో లారీల యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నందారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు లేకుండా పెంచుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే బంద్​కు పిలుపునిస్తామని హెచ్చరించారు.

డీజిల్, పెట్రోల్​ను జీఎస్టీలో చేర్చాలని లారీ ఓనర్స్ ధర్నా

ఇదీ చూడండి:జిలుగు సాగును సందర్శించిన మంత్రి ఈటల రాజేందర్​

Last Updated : Jun 20, 2020, 10:58 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details