హైదరాబాద్ పాతబస్తీ బాబానగర్‌లో వరదలో ఓ ఆటో కొట్టుకెళ్లింది. చాంద్రాయణగుట్ట కార్పొరేటర్ అబ్దుల్ వాహబ్ వరద నీటిలో తడుస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అందరూ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కు వెళ్లాలంటూ చెబుతుండగానే ఓ ఆటో ఆయన వెనక నుంచి కొట్టుకెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈ ఘటనలో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది.
కార్పొరేటర్ హెచ్చరిస్తుండగానే కొట్టుకెళ్లిన ఆటో
వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. తాజాగా మరోసారి వర్షం కురవటంతో నగరవాసులు భయపడి పోతున్నారు. పాతబస్తీ బాబానగర్‌లో కార్పొరేటర్ నీటిలో తడుస్తూ ప్రజలను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కు వెళ్లాలంటూ చెబుతుండగానే ఓ ఆటో ఆయన వెనక నుంచి కొట్టుకెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.
కార్పొరేటర్ హెచ్చరిస్తుండగానే కొట్టుకెళ్లిన ఆటో