Auto Unions Protests: ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల నుంచి లక్షల మంది నగరంలో ఈ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నామని పేర్కొన్నారు. "గతంలో సీఎన్జీ ఆటోలు కొనమని ప్రభుత్వం చెప్పింది. జిల్లాల్లో సీఎన్జీ బంకులు లేవు. అందుకే నగరాల్లో నడుపుతున్నాం. ఇప్పుడు కాలుష్యం పేరుతో ఇతర జిల్లాల ఆటోలు నగరంలో నడపొద్దని చెబుతున్నారు. కొనమని చెప్పేది వారే.. వద్దని చెప్పేది వారే అని" అసహనం వెలిబుచ్చారు. తమ సమస్యపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించాలని డిమాండ్ చేశారు.
"ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుతున్నాం.. ఇప్పుడు సిటీలో నడపొద్దంటే ఎలా.?" - auto unions
Auto Unions Protests: ఇతర జిల్లాలకు చెందిన ఆటోలను హైదరాబాద్‌లో తిరగనీయకపోవడాన్నినిరసిస్తూ ఆటో సంఘాలు ఆందోళనకు దిగాయి. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయం ఎదుట ఆటో డ్రైవర్లు, యజమానులు ధర్నా చేపట్టారు. హైదరాబాద్ నగర పరిధిలో రిజిస్టర్ అయిన వాహనాలు మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాలనే నిబంధన పెట్టడం అన్యాయమని ఆటో సంఘాలు ఆరోపించాయి. దీనివల్ల 3 లక్షల మంది ఉపాధి కోల్పోతారని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకు సంబంధించి మరిన్ని వివరాలు "ఈటీవీ భారత్" ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ల ఆందోళన