తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆటో డ్రైవర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి' - ఏఐటీయూసీ భవన్​ ఎదుట ఆటో డ్రైవర్ల ధర్నా

కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతోన్న ఆటో డ్రైవర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఆటోల్లో ప్రయాణికులు ఎక్కకపోవడం వల్ల జీవన భృతి పోయిందని యూనియన్ నాయకుడు వెంకటేశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

'ఆటో డ్రైవర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి'
'ఆటో డ్రైవర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి'

By

Published : Sep 16, 2020, 4:23 PM IST

కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతోన్న ఆటో డ్రైవర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఆటో డ్రైవర్స్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ... హైదరాబాద్ హిమాయత్ ఏఐటీయూసీ భవన్ ముందు యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు.

కరోనా వల్ల దేశవ్యాప్తంగా రవాణా రంగంపై పెనుభారం పడిందని.. ముఖ్యంగా ఆటోల్లో ప్రయాణికులు ఎక్కకపోవడం వల్ల జీవన భృతి పోయిందని యూనియన్ నాయకుడు వెంకటేశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఆటో డ్రైవర్స్‌ ప్రతి కుటుంబానికి ప్రతి నెల రూ.7500 ఇవ్వాలని.. ఆటో ఫైనాన్స్ బాకీలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. అధికంగా పెరుగుతోన్న డీజిల్, పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కోరారు.

ఇదీ చదవండి:'ఆటో డ్రైవర్' మళ్లీ జిల్లా వైద్యాధికారిగా..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details