తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రాన్స్​జెండర్​పై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం - RAPE ATTEMPT ON TRANGENDER

భిక్షాటన చేసి నడుచుకుంటూ వెళ్తున్న ఓ ట్రాన్స్​జెండర్​ను ఇంటిదగ్గర దింపుతానంటూ ఆటో ఎక్కించుకున్నాడో డ్రైవర్. నిర్మానుష్య ప్రదేశంలో ఆటో నిలిపి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఎలాగోలా తప్పించుకున్న ఆమె... ఈ రోజు నిందితుడిని పట్టుకొని బాచుపల్లి పోలీసులకు అప్పగించింది.

auto-driver-rape-attempt-on-trangender-in-hyderabad
ట్రాన్స్​జెండర్​పై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం

By

Published : Dec 25, 2019, 11:42 PM IST

హైదరాబాద్​లోని బొల్లారంలో నివాసముండే 24 ఏళ్ల ట్రాన్స్​జెండర్ రెజీనా ప్రతిరోజూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. సోమవారం రాత్రి 8 గంటలకు రెజీనా భిక్షాటన చేటి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో ఇంటి దగ్గర దింపుతానంటూ ఓ ఆటో డ్రైవర్ ఆమె వద్దకు వచ్చాడు. ఆటోలో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఎలాగోలా తప్పించుకున్న రెజీనా బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వద్ద ఉన్న 1500 రూపాయలు లాక్కొన్ని, ఛాతిపై తీవ్రంగా కొట్టాడని వాపోయింది. సోమవారం రాత్రి ఘటన జరగగా... పోలీసులు ఆటో డ్రైవర్ మహేశ్​ని పట్టుకోకపోవడం వల్ల మిగిలిన ట్రాన్స్​జెండర్స్​తో కలిసి రంగంలోకి దిగింది. ఆటో డ్రైవర్ మహేశ్​ని పట్టుకొని పోలీసులకు అప్పగించింది.

మహిళలపై అత్యాచారం జరిగితే వెంటనే స్పందించే పోలీసులు... ట్రాన్స్​జెండర్లపై అఘాయిత్యాలు జరిగితే స్పందించకపోవడం బాధాకరమని తెలిపారు. ఇప్పటికైనా మహేశ్​పై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలంటూ రెజీనా వేడుకుంటోంది.

ట్రాన్స్​జెండర్​పై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం

ఇవీ చూడండి: తాగిన మత్తులో నాగుపాముకు ముద్దు ఇచ్చాడు.. తర్వాత ఏమైంది?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details