తన ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ చేతి సంచిని దొంగిలించిన డ్రైవర్‌ను నారాయణగూడ పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 8న హిమాయత్‌నగర్‌కు చెందిన మాధవి అనే మహిళ లక్డీకాపుల్ నుంచి ఇంటికొచ్చేందుకు ఆటో ఎక్కింది. ఇంటి వద్ద దిగిన తర్వాత ఆటోలో తన చేతి సంచిని మరచిపోయి దిగి వెళ్లిపోయింది. వెనక్కొచ్చి చూసేలోగా ఆటో డ్రైవర్ బ్యాగ్‌తో సహా ఉడాయించాడు. ఈ విషయంపై 9న నారాయణగూడ ఠాణాలో ఫిర్యాదు చేసింది. తాను పోగొట్టుకున్న బ్యాగ్‌లో 3.5 తులాల బంగారం, రూ.42 వేల నగదు, ఓ చరవాణి ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆటో వివరాలు సేకరించారు. ఆటో డ్రైవర్ బి.బ్రహ్మంను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి చరవాణి స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ప్రయాణికురాలి బ్యాగ్ దొంగిలించిన ఆటో డ్రైవర్ అరెస్ట్ - arrest
తన ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ బ్యాగ్ దొంగిలించిన ఆటో డ్రైవర్‌ను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని పట్టుకుని అతని నుంచి చరవాణి స్వాధీనం చేసుకున్నారు.
ప్రయాణికురాలి బ్యాగ్ దొంగిలించిన ఆటో డ్రైవర్ అరెస్ట్