హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పట్ల ఆటో డ్రైవర్ నరసింహ అసభ్యంగా ప్రవర్తించాడు. ఉద్యోగిని చేయిపట్టుకు లాగాడు.. ఆమె కేకలేయడంతో చుట్టుపక్కలున్న స్థానికులు అక్కడికి చేరుకుని నరసింహకు దేహశుద్ధి చేశారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ అసభ్యప్రవర్తన - telangana news
నిర్భయ లాంటి కఠిన చట్టాలు వచ్చినా ఆడపడుచుల పట్ల అఘాయిత్యాలు ఆగడం లేదు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అబలలపై దారుణాలకు పాల్పడిన క్రూరమృగాలను కఠినంగా పోలీసులు శిక్షించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పట్ల ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ అసభ్యప్రవర్తన
అనంతరం స్తంభానికి కట్టేసి మరోసారి చితకబాదారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి : సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని.. రాజకీయాల్లో పోటీ..