AUTO and CAB Drivers Problems in Telangana : చక్రం తిరిగితేనే వారి జీవితం ముందుకు సాగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చక్రాలే వారి జీవనాధారం. రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు, ఓలా, ఊబర్ క్యాబ్‌లు, ఆటోలపై ఆధారపడి సుమారు 12 లక్షల మంది ప్రత్యక్షంగా జీవనం సాగిస్తున్నారు. పరోక్షంగా సుమారు 15లక్షల మంది ఆటో మొబైల్ రంగంపై ఆధారపడి ఉన్నారని ఆటో, క్యాబ్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఎన్నికల్లో ఆటో, క్యాబ్ డ్రైవర్లు కూడా నిర్ణయాత్మక శక్తులేనని స్పష్టం చేస్తున్నారు.
AUTO and CAB Drivers Demands : కొన్ని సంవత్సరాలుగా సమస్యలతో సావాసం చేస్తున్నామని ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వారు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలో మాట్లాడినప్పటికీ.. ఏ పార్టీ కూడా మేనిఫేస్టోలో తమ సమస్యలను ప్రస్తావించలేదని వాపోతున్నారు. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ మేనిఫేస్టో(BRS Manifesto) ప్రకటించిందని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మేనిఫేస్టోలను ప్రకటించాల్సి ఉందని తెలిపారు. కనీసం ఆయా పార్టీల మేనిఫెస్టోలోనైనా.. తమ సమస్యలను ప్రస్తావించాలని కోరుతున్నారు. లేదంటే దసరా పండుగ తర్వాత ఐక్య కార్యాచరణ రూపొందించుకుని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు.
Cab Drivers problems : గాడితప్పిన బతుకుచక్రం.. మారేనా జీవనచిత్రం
Telangana AUTO and CABs Details : తెలంగాణలో సుమారు మూడున్నర లక్షల వరకు క్యాబ్‌లు ప్రయాణికులను నిత్యం గమ్యస్థానాలకు చేర్చుతున్నాయని డ్రైవర్లు తెలిపారు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సుమారు 1,50,000ల క్యాబ్‌లు ఉన్నాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు. అందులో ఐటీ సెక్టార్లో సుమారు 50,000ల పైచిలుకు క్యాబ్(CAB DRIVERS)లు సేవలందిస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడున్నర లక్షల ఆటోలు ఉన్నాయని.. అందులో హైదరాబాద్‌లో 1,40,000ల ఆటోలేనని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీటితో పాటు మరో 80,000ల ఆటోల వరకు ఉంటాయని ఆటో అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్‌లు కలిపి సుమారు ఎనిమిది లక్షలకు తిరుగుతున్నాయని తెలిపారు.
తెలంగాణలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల వివరాలు సుమారుగా:
నగరం | క్యాబ్‌లు | ఆటోలు |
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో | 1,50,000 | 2,20,000 |
ఐటీ సెక్టార్లో | 50,000 | 1,40,000(హైదరాబాద్‌లో) |
తెలంగాణలో మొత్తం | 3,50,000 | 3,50,000 |