తెలంగాణ

telangana

ETV Bharat / state

'వారికి కావాల్సింది జాలి కాదు.. చేయూత' - telangana home minister mahmood ali about autism

బుద్ధి మాంద్యం(ఆటిజం) వ్యాధి కలిగిన చిన్నారుల పట్ల జాలి చూపకుండా వారికి చేయూతనివ్వాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు.

'వారికి కావాల్సింది జాలి కాదు.. చేయూత'

By

Published : Nov 15, 2019, 3:03 PM IST

'వారికి కావాల్సింది జాలి కాదు.. చేయూత'

హైదరాబాద్​లో బాలల దినోత్సవం సందర్భంగా ఆటిజం కలిగిన చిన్నారులు ర్యాంప్​ వాక్​ చేస్తూ సందడి చేశారు. మాధవ్​ ఆటిజం ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హోంమంత్రి మహమూద్​ అలీ హాజరయ్యారు.

మిసెస్​ ఇండియా, తెలంగాణ క్వీన్స్​లతో కలిసి చిన్నారులు ర్యాంప్​ వాక్​ చేశారు. మామూలు పిల్లల కంటే ఈ పిల్లలు ప్రత్యేకమైన వారని మంత్రి మహమూద్​ అలీ అన్నారు. తన కుమారుడి లాంటి ప్రత్యేక చిన్నారుల కోసం ఈ ఫౌండేషన్​ స్థాపించడం అభినందనీయమని డా.సుమన్​ సరఫ్​ను కొనియాడారు.

తన కుమారుడు మాధవ్​ పడుతున్న బాధను చూసి ఈ సంస్థ నెలకొల్పినట్లు డాక్టర్​ సుమన్​ సరఫ్​ తెలిపారు. ఈ తరహా పిల్లల పట్ల ఏ విధంగా వ్యవహరించాలో తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details