ఫార్మా, టెక్స్ టైల్, రైస్ మిల్స్, నిర్మాణ సంస్థలు తదితర అన్ని పరిశ్రమలు నుంచి వలస కూలీల సమాచారం సేకరించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్‌లు అధికారులను ఆదేశించారు. దీని కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని తెలిపారు.
పరిశ్రమల వలస కూలీల సమాచారం సేకరించాలని ఆదేశం
అన్ని పరిశ్రమలు నుంచి వలస కూలీల సమాచారం సేకరించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్‌లు అధికారులను ఆదేశించారు. దీని కోసం ప్రత్యేేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు.
Authorities ordered to Authorities ordered to collect information on migrant workers
సీఎం ఆదేశాల మేరకు వలస కూలీల సంక్షేమంపై బీఆర్కే భవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సేకరించిన వివరాలు వలస కూలీలకు రేషన్ కార్డులు అందించటం, విద్యా, ఆరోగ్యం, నైపుణ్య శిక్షణకు ఉపయోగపడుతుందన్నారు. 10 రోజుల్లో సమాచారం సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. దీనికోసం నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని సీఎస్ తెలిపారు.
ఇదీ చూడండి. CS SOMESH KUMAR: కలెక్టరేట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి