తెలంగాణ

telangana

ETV Bharat / state

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్రవాహనాల వేలం - సైబరాబాద్ లో ద్విచక్రవాహనాల వేలంపాట

సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను వేలం వేయనున్నారు. సంబంధిత వాహనాల యజమానులు ఆరు నెలల్లో దరఖాస్తులు చేయకపోతే వాటిని వేలం వేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్రవాహనాల వేలం
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్రవాహనాల వేలం

By

Published : Nov 13, 2020, 10:22 PM IST

సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను వేలం వేయనున్నారు. సుమారు 2,061 వాహనాలు వివిధ కేసుల్లో పట్టుబడ్డాయని... వీటి యజమానులు ఇప్పటి వరకు తమను సంప్రదించలేదని పోలీస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వాహనాలు మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఉన్నాయని పేర్కొన్నారు.

వాహనాలకు సంబంధించిన యజమానులు 6 నెలల్లో అన్ని ఆధారాలతో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌కు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. సంబంధిత వాహనాల యజమానులు ఆరు నెలల్లో దరఖాస్తులు చేయకపోతే వాటిని వేలం వేస్తామని స్పష్టం చేశారు.

ఇందుకు సంబంధించి సైబరాబాద్‌ సీఏఆర్‌ రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ వెంకటస్వామిని ఫోన్‌ నెంబర్‌ 9491039164 ద్వారా సంప్రదించవచ్చని... లేదా www.cyberabadpolice.gov.in వెబ్‌సైట్‌లో కూడా వాహనాల వివరాలు ఉంటాయని పోలీసు ఉన్నతాధిరులు వివరించారు.

ఇదీ చూడండి:'దూద్ దురంతో 4 కోట్ల లీటర్లు దాటిన పాల రవాణా'

ABOUT THE AUTHOR

...view details