తెలంగాణ

telangana

ETV Bharat / state

పాతనోట్లు ఇస్తామంటూ.. కొత్తనోట్లు కొట్టేశారు... - saidabad

అత్యాశకు పోయిన ఓ పెట్రోల్‌ బంకు యజమానిని ముగ్గురు సభ్యుల ముఠా మోసం చేసి రూ.12 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైదాబాద్​ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి డబ్బు స్వాధీనం చేసుకున్నారు.

పాతనోట్లు ఇస్తామంటూ కొత్తనోట్లు కొట్టేశారు..

By

Published : Aug 23, 2019, 11:11 PM IST

రద్దయిన పాతనోట్లకు అధిక మొత్తం సొమ్ము వస్తుందని నమ్మబలికి ఓ వ్యక్తి నుంచి ముగ్గురు సభ్యుల ముఠా రూ.12 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో 48 గంటల్లోనే నిందితులు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. సైదాబాద్​ సమీపంలోని పుత్లిబౌలిలోని పెట్రోల్‌ బంకు యజమాని రాజ్‌కుమార్‌ బగాడియా వద్ద పనిచేసే రాజేష్‌ అనే వ్యక్తి... తన యజమానిని ఎలాగైనా మోసం చేసి డబ్బుకాజేయాలనుకున్నాడు. చంద్రాయణగుట్టకు చెందిన ఆబేద్‌ మోహియుద్దీన్‌, షేక్‌ అబ్దుల్‌ బాసిత్‌తో కలిసి ముఠాగా ఏర్పడి పథకం వేశాడు. ఈ క్రమంలో రాజేష్‌ తన యజమాని బగాడియాతో రద్దయిన పాత కరెన్సీ రూ. 500 నోటు ఇస్తే రూ.50 వేలు తనకు తెలిసిన వ్యక్తులు కొందరు ఇస్తారని నమ్మబలికాడు. అయితే పాత నోట్లు ఎవరిస్తారని అడగ్గా తనకు తెలిసిన వారి దగ్గర ఇప్పిస్తానని నమ్మించాడు. అక్రమంగా డబ్బు వస్తుందని ఆశపడిన బగాడియా రాజేష్​ చెప్పినట్లు పాతనోట్ల కోసమని రూ. 12లక్షలు కొత్తనోట్లు ఇచ్చాడు. డబ్బు తీసుకున్నవాళ్లు రాకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైదాబాద్​ పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ తెలిపారు.

పాతనోట్లు ఇస్తామంటూ కొత్తనోట్లు కొట్టేశారు..

ABOUT THE AUTHOR

...view details