హైదరాబాద్ హుమాయూన్‌నగర్ పీఎస్ పరిధిలో పాత కక్షల కారణంగా జరిగిన గొడవ కత్తిపోట్లకు దారి తీసింది. హుమాయూన్‌నగర్ ఫస్ట్ లాన్సర్‌లో ఉన్న పాన్ షాప్ వద్ద గంజాయి సేవించి మత్తులో ఉన్న శర్ఫూఖాన్, షాహనవాజ్ ఖాన్, తాహేర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, ఫయ్యాజ్ ఖాన్ అనే అనే ఐదుగురు కలిసి అటు వైపుగా వెళ్తున్న ఫజల్ అలీ, ఆఝర్ అలీఖాన్‌లపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో వారిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పాత కక్షలతో ఇద్దరిపై కత్తులతో దాడి
పాత కక్షల కారణంగా జరిగిన గొడవ కత్తిపోట్లకు దారితీసిన ఘటన హైదరాబాద్‌లోని హుమాయూన్ నగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పాత కక్షలతో ఇద్దరిపై కత్తులతో దాడి
Last Updated : Aug 10, 2019, 7:00 PM IST