హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటాబజార్‌లో దారుణం జరిగింది. ఆరుగురు మహిళలు, ముగ్గురు వ్యక్తులు కలిసి పాతకక్షలతో ఓ యువకుడిపై దాడి చేశారు. ఇందుకు ఒకరోజు ముందే అమీర్‌ను చంపేస్తామని హెచ్చరించగా... బెదిరింపులకు భయపడి గోల్కొండ పోలీసులను ఆశ్రయించారు. అమీర్ చెప్పిన వారిని పట్టుకుని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
కత్తెర, గాజు సీసాలతో యువకునిపై మహిళల దాడి - attempt murder at chotabazar by 9 persons
హైదరాబాద్ చోటాబజార్‌లో ఓ యువకుడిపై పలువురు దాడికి పాల్పడ్డారు. ఆరుగురు మహిళలు, ముగ్గురు వ్యక్తులు కలిసి పాతకక్షలతో యువకుడిని కత్తెర, గాజు సీసాలతో కొట్టారు. భయపడ్డ బాధితుడు.. పోలీసులను ఆశ్రయంచగా.. వారు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
కత్తెర, గాజు సీసాలతో యువకునిపై మహిళల దాడి
శుక్రవారం రాత్రి సమయంలో తొమ్మిది మంది వచ్చి.. కత్తెరలు, గాజు సీసాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అమీర్ కేకలు పెట్టాడు. అరుపులు విని అక్కడికి చేరుకున్న స్థానికులు అతన్ని రక్షించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... అమీర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:ఆటోడ్రైవర్ చేసిన పెట్రోల్ దాడిలో.. హెల్త్‌వర్కర్ మృతి