తెలంగాణ

telangana

ETV Bharat / state

దాడులను వెంటనే అరికట్టాలి - gouds

కల్లుగీత వృత్తిదారులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని గౌడ సంఘాల సమన్వయ సమితి డిమాండ్​ చేసింది. హైదరాబాద్​ బషీర్​ బాగ్​ ప్రెస్​ క్లబ్​లో గీత కార్మికులపై దాడులను ఖండిస్తూ రౌండ్​ టేబుల్​ సమావేశం జరిగింది.

బాలరాజు గౌడ్

By

Published : Jun 29, 2019, 8:03 PM IST

హైదరాబాద్​ బషీర్​ బాగ్​ ప్రెస్​ క్లబ్​లో గౌడ సంఘాలు రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించారు. గీత వృత్తిదారులపై రోజు రోజుకు అగ్రకుల దాడులు పెరిగిపోతున్నా... ప్రభుత్వ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాలపల్లి గ్రామంలో వందల ఏళ్లనాటి ఎల్లమ్మ గుడిపై, గౌడన్నలపై స్థానిక సర్పంచ్ సంతోశ్​ రెడ్డి భౌతిక దాడులకు పాల్పడ్డారని వాపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం మూసిపట్ల గ్రామంలో లింగాల వెంకన్న గౌడ్​ను తాటి చెట్టుపైనే సజీవ దహనం చేశారన్నారు. కరీంనగర్ జిల్లా సైతాపూర్ మండలం నర్సాయిపేటలో 480 ఎకరాల భూమిని మైనింగ్​కు ఇచ్చి పాపన్న చెరువును, కోటలను విధ్వంసం చేసే కుట్రను తక్షణమే ఆపాలన్నారు.

దాడులను వెంటనే అరికట్టాలి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details