కాగజ్ నగర్ పట్టణంలో అటవీ అధికారిణిపై దాడికి సంబంధించి హైదరాబాద్ అరణ్య భవన్లో అటవీ అధికారుల సంఘాలు సమావేశమయ్యాయి. కాగజ్ నగర్లో అటవీ అధికారిణిపై జరిగిన దాడిని అన్ని సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచటంపై అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారితో పాటు, సూత్రధారులపై కూడా వేగంగా విచారణ జరపాలన్నారు. చట్ట ప్రకారం తగిన శిక్ష పడేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
అటవీ భూముల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని, తగిన భద్రత కల్పిస్తూ పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్ఠం చేయాలని కోరారు. అటవీ భూములను ఆక్రమించటమే కాకుండా తమపైనే దాడికి దిగుతున్న వారిపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు.
అటవీ అధికారిణిపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలి - FOREST LANDS
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ అధికారిణిపై జరిగిన దాడికి సంబంధించి హైదరాబాద్‌లోని అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో అన్ని స్థాయిల అటవీ అధికారులు సమావేశమయ్యారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌తో పాటు స్టేట్ ఫారెస్ట్ సర్వీస్, మినిస్టీరియల్ స్టాఫ్, రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ సంఘాల ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరై దాడిని ఖండించారు.
అటవీ భూమాల రక్షణకు తగిన భద్రత కల్పించాలి : అటవీ అధికారుల సంఘం
ఇవీ చూడండి : బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత...