తెలంగాణ

telangana

ETV Bharat / state

గుంటూరులో తెదేపా నేతపై రాళ్లు, కర్రలతో దాడి - పిన్నెల్లి వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో తెదేపా నాయకుడు షేక్‌ గౌస్‌పై దాడి జరిగింది. రాళ్లు, కర్రలతో దుండగులు దాడి చేసిన ఘటనలో.. గౌస్‌ తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పిడుగురాళ్లలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి ఆయనను తరలించారు.

attack-on-tdp-leader-in-guntur
గుంటూరులో తెదేపా నేతపై రాళ్లు, కర్రలతో దాడి

By

Published : Jun 24, 2020, 7:01 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లాలో తెదేపా కార్యకర్తలపై దాడులు మళ్లీ మొదలయ్యాయి. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో తెదేపా నేత షేక్ చింతపల్లి గౌస్​పై దాడి జరిగింది. రాళ్లు, కర్రలతో దాడి చేయగా గౌస్ తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు అతనిని పిడుగురాళ్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం గౌస్​కు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నందునే దాడి జరిగినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. గతంలో స్థానిక ఎన్నిక ప్రక్రియ మొదలైన సమయంలో కూడా ఇలాగే దాడులు జరిగాయన్నారు. మళ్లీ ఇప్పుడు ఇలాంటి ఘటనలు పునరావృతం కావటం కారణంగా పల్నాడులో ఆందోళన నెలకొంది.

గుంటూరులో తెదేపా నేతపై రాళ్లు, కర్రలతో దాడి

ఇవీ చదవండి:గుడ్​న్యూస్​: కరోనాను ఎదుర్కోవడం ఇంకాస్త ఈజీ

ABOUT THE AUTHOR

...view details