సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండ్లపల్లి వీఆర్ఏపై అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. కృష్ణ పరివాహక ప్రాంతమైన గుండ్లపల్లి, రఘునాధపాలెంలో ఇసుక రీచ్‌లో ఎలాంటి అనుమతి లేకుండా అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలతో ఇసుక, సున్నపురాయిని తరలిస్తున్నారు. వీఆర్ఏ షేక్ సైదా ఇసుక ట్రాక్టర్ అడ్డుకోవడం వల్ల అధికార పార్టీ కార్యకర్తలు వీఆర్ఏపై దాడి దిగి మోటార్ సైకిల్, చరవాణిని ధ్వంసం చేశారు. ఈ విషయమై వీఆర్ఏ షేక్ సైదా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వీఆర్ఏపై అధికార పార్టీ కార్యకర్తల దాడి - vra
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు పెరిగిపోతున్నాయి. అటవీ అధికారి అనితపై దాడి మరిచిపోకముందే సూర్యాపేట జిల్లా గుండ్లపల్లిలో వీఆర్ఏపై అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేశారు.
షేక్ సైదా