తెలంగాణ

telangana

ETV Bharat / state

రాహుల్‌ సిప్లిగంజ్‌పై దాడి.. తీవ్ర రక్తస్రావం - big boss-3 wonner rahul sipliganju

బిగ్‌బాస్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్బులో బుధవారం రాత్రి దాడి జరిగింది. తలపై బీరుసీసాలతో కొట్టడం వల్ల తీవ్ర రక్తస్రావమైంది. అతన్ని వెంటనే గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

attack on rahul siplignju
రాహుల్‌ సిప్లిగంజ్‌

By

Published : Mar 5, 2020, 6:54 AM IST

Updated : Mar 5, 2020, 12:27 PM IST

గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు బుధవారం రాత్రి 11.45 గంటలకు వెళ్లారు. కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. రాహుల్‌ వారిని నిలదీయడం వల్ల మాటామాటా పెరిగింది.

అరగంట తర్వాత ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఒక దశలో యువకులు రాహుల్‌ను బీరు సీసాలతో కొట్టారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డా రాహుల్​ను ఆస్పత్రికి తరలించారు. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్లు సమాచారం.

రాహుల్‌ సిప్లిగంజ్

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడి-ఎస్పీఓ సహా ఇద్దరు మృతి

Last Updated : Mar 5, 2020, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details