లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలో విధి నిర్వాహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్.. ఓ వ్యక్తిపై దాడి చేయగా... అతను తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి తలకు గాయమైంది. ఈ ఘటనపై స్పందించిన నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ దాడికి పాల్పడిన కానిస్టేబుల్ సుధాకర్‌ను విధుల నుంచి తప్పించారు. ప్రజల భద్రత, రక్షణ కోసం నగర పోలీసులు కట్టుబడి ఉండాలని అంజనీకుమార్ సూచించారు.
వ్యక్తిపై దాడి.. కానిస్టేబుల్ సస్పెండ్ - hyderabad police updates
ప్రజల భద్రత, రక్షణ కోసం పోలీసులు కట్టుబడి ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. పాతబస్తీలో ఓ వ్యక్తిపై దాడి చేసిన కానిస్టేబుల్‌ను ఆయన సస్పెండ్ చేశారు.
![వ్యక్తిపై దాడి.. కానిస్టేబుల్ సస్పెండ్ Attack on person ... Constable suspended](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6983743-595-6983743-1588144731199.jpg)
వ్యక్తిపై దాడి... కానిస్టేబుల్ సస్పెండ్
TAGGED:
hyderabad police updates