తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ: పేర్ని నానిపై దాడి కేసులో కొల్లు రవీంద్ర ఇంటికి పోలీసులు - perni nani case

ఏపీ మంత్రి పేర్ని నానిపై దాడి ఘటనలో విచారణలో భాగంగా పలువురు తెదేపా నాయకులను పోలీసులు ప్రశ్నించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను స్టేషన్​కు తీసుకెళ్లేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే తాను స్టేషన్​కు రావాల్సిన అవసరం ఏముందని, విచారణలో పోలీసులు అనుసరిస్తున్న విధానం సరైంది కాదని రవీంద్ర ఆరోపించారు.

perni
ఏపీ: పేర్ని నానిపై దాడి కేసులో కొల్లు రవీంద్ర ఇంటికి పోలీసులు

By

Published : Dec 4, 2020, 3:19 PM IST

ఏపీ మంత్రి పేర్ని నానిపై దాడి ఘటనలో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురు తెదేపా నాయకులను పోలీసులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్రను స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే తన స్టేట్‌మెంట్‌ను లిఖితపూర్వకంగా నమోదు చేసుకున్నారని.. స్టేషన్‌కు రావాల్సిన అవసరమేంటని కొల్లు రవీంద్ర.. పోలీసులను ప్రశ్నించారు.

పోలీసులు అనుసరిస్తున్న విధానం సరికాదని రవీంద్ర అన్నారు. ఏ మాత్రం సంబంధం లేని విషయంలో తనను ప్రశ్నించేందుకు స్టేషన్‌కు రమ్మనే విషయంలో పునరాలోచన చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. విషయం తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు, అనుచరులు రవీంద్ర ఇంటికి భారీగా చేరుకున్నారు.

ఇదీ చదవండి:ఎస్​ఈసీ పార్థసారథి రాజీనామాకు బండి సంజయ్ డిమాండ్

ABOUT THE AUTHOR

...view details