తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్​ఆర్​నగర్​లో నవదంపతులపై కత్తులతో దాడి - నవ దంపతులపై దాడి

హైదరాబాద్​లోని ఎస్​ఆర్​నగర్​ బస్టాండ్​లో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకుని.. రక్షణ కోసం ఎస్​ఆర్​నగర్​ పోలీస్​ స్టేషన్​కు వచ్చి వెళ్తున్న నవజంటపై దుండగులు దాడికి పాల్పడ్డారు. అనంతరం వారు పరారయ్యారు. హుటాహటిన వధూవరులను ఆస్పత్రికి తరలించారు.

ఎస్​ఆర్​నగర్​లో నవదంపతులపై కత్తులతో దాడి

By

Published : Jun 7, 2019, 9:13 PM IST

Updated : Jun 8, 2019, 12:03 AM IST

ఎస్​ఆర్​నగర్​లో నవదంపతులపై కత్తులతో దాడి

భాగ్యనగరం నడిబొడ్డున మరో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్న నవ దంపతులపై ఎస్​ఆర్​నగర్​ బస్టాండ్​లో దుండగులు కత్తులతో దాడిచేసి పరారయ్యారు. బోరబండకు చెందిన సయ్యద్​ పాతిమా, సంగారెడ్డికి చెందిన ఇంతియాజ్​ ఈ నెల ఐదో తేదీన ప్రేమ వివాహం చేసుకున్నారు. తమపై దాడి జరగవచ్చనే అనుమానంతో ఇవాళ సాయంత్రం ఎస్​ఆర్​నగర్​ పోలీస్​ స్టేషన్​కు వచ్చి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇరువర్గాలతో మాట్లాడి రక్షణ కల్పించడంపై నిర్ణయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

అక్కడి నుంచి ఇంటికి వెళ్తున్న వధూవరులపై సుమారు పది మంది దాడి చేశారు. యువతి తరఫు బంధువులే దాడి చేశారని వరుడు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తీవ్రగాయాలైన వరుడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఇవీ చూడండి: భార్య కళ్లముందే ప్రియుడిని చంపేశాడు..

...

Last Updated : Jun 8, 2019, 12:03 AM IST

ABOUT THE AUTHOR

...view details