హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద రెండు రోజుల కిందట నటి షాలూ చౌరాసియాపై దాడి (Attack on Actress) ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నటిపై దాడి (Attack on Actress) చేసిన తర్వాత నిందితుడు కేబీఆర్ పార్క్ పరిసరాల్లో సుమారు నాలుగు గంటల పాటు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారాంగా అతని కదలికలను గుర్తించారు. నటికి పరిచయస్తులే దాడి (Attack on Actress) కి పాల్పడ్డారా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణ కొనసాగుతుండగానే.. పోలీసులు చౌరాసియా సెల్‌ఫోన్ పౌచ్‌ను అపోలో ఆస్పత్రి వద్ద గుర్తించారు. నిందితుడే అక్కడ పౌచ్ పడేసినట్లు భావిస్తున్నారు. సెల్‌ఫోన్ పౌచ్ తనదేనని నటి గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
సినీ నటి చౌరాసియాపై దాడి (Attack on Actress) ఘటనలో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు లాక్కెళ్లిన ఐఫోన్‌ను ట్రాక్ చేస్తున్నారు. ఘటన అనంతరం నిందితులు దాదాపు నాలుగు గంటల పాటు కేబీఆర్ చుట్టుపక్కల ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో దాడి (Attack on Actress) జరిగిందని పోలీసులకు ఆమె సమాచారం ఇచ్చారు. అగంతుకుడు ఆమెను కొట్టి చరవాణి లాక్కొని జీహెచ్‌ఎంసీ నడకదారి మీదుగానే జారుకున్నాడు. చౌరాసియా స్టార్‌బక్స్ హోటల్ సిబ్బంది సాయంతో తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆసుపత్రికి వెళ్లారు. అగంతుకుడు జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 1లోని బీవీబీ కూడలి, బాలకృష్ణ నివాసం ముందున్న గేటు నుంచి బయటకు వచ్చినట్లు సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. ఒంటి గంట ప్రాంతంలో చిచ్చాస్ హోటల్ ముందు నుంచి కేబీఆర్ ఉద్యానం వైపు వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మొత్తంగా రాత్రి 9 నుంచి ఒంటిగంట వరకు నిందితుడు ఉద్యాన ప్రాంతంలోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు.