హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారు మైసమ్మ దేవాలయం పక్కన ఉన్న ఐసీఐసీఐ, ఆక్సిస్ బ్యాంక్ ఏటీఎంలపై గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. సమాచారం అందుకున్న మీర్ చౌక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నిప్పు ఆర్పివేశారు.
ఏటీఎంలకు నిప్పంటించిన దుండగుడు.. - ఏటీఎంలకు నిప్పంటిచిన దుండగుడు.. తప్పిన ముప్పు
ఓ దుండగుడు చంద్రాయణగుట్ట వద్ద ఉన్న రెండు ఏటీఎంలకు నిప్పంటించాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులుకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి మంటలు ఆర్పివేశారు.
![ఏటీఎంలకు నిప్పంటించిన దుండగుడు.. atms got fired by unknown person in chandrayangutta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6031009-739-6031009-1581393907747.jpg)
ఏటీఎంలకు నిప్పంటిచిన దుండగుడు.. అప్రమత్తతతో తప్పిన ముప్పు
గుర్తు తెలియని వ్యక్తి రాత్రి 3.20 గంటలకు ఐసీఐసీఐ, ఆక్సిస్ బ్యాంకుల ఏటిఎంలపై ఇంజన్ ఆయిల్ పోసి నిప్పు అంటించినట్లు మీర్ చౌక్ ఏసీపీ ఆనంద్ తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వెంటనే అప్రమత్తమైన చాంద్రాయణగుట్ట పోలీసులు పెద్ద ఘటన జరగకుండా నివారించగలిగారు. బ్యాంక్ మేనేజర్లకు సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి పోలీసులకు సహకరించారు.
ఏటీఎంలకు నిప్పంటిచిన దుండగుడు.. అప్రమత్తతతో తప్పిన ముప్పు