హైదరాబాద్ సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం సెంటర్లలో దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్న అశోక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు ఏటీఎం ఎలా ఉపయోగించాలో తెలియని వృద్ధులను టార్గెట్ చేసేవాడని సరూర్నగర్ సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఏటీఎం వాడడం రాకపోతే నేను చూపిస్తా అంటూ అసలు కార్డును తీసుకొని నకిలీ కార్డు ఇచ్చి డబ్బులు డ్రా చేసి మోసాలకు పాల్పడే వాడన్నారు.
ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ - atm cheater
పలు ప్రాంతాల్లోని ఏటీఎం సెంటర్ల వద్ద దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్న అశోక్ అనే వ్యక్తిని సరూర్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 97,500 నగదు, ఆరు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్