కరోనా వైరస్ వ్యాప్తి సందర్భంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. బ్యాంకుల్లో, ఏటీఎం కేంద్రాల్లో రద్దీని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు వీలుగా ఖాతాదారులు డిజిటల్ లావాదేవీలను వినియోగించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ యుఎన్‌ఎన్ మైయా తెలిపారు.
ఏటీఎం కేంద్రాల్లో లైన్లు వద్దు... డిజిటల్ లావాదేవీలు ముద్దు
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా బ్యాంకులు కూడా ఆ దిశలో పనిచేస్తున్నాయి. బ్యాంకుల్లో, ఏటీఎం కేంద్రాల్లో రద్దీని తగ్గించేందుకు వీలుగా ఖాతాదారులు డిజిటల్ లావాదేవీలు ఉపయోగించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ కోరారు.
ఏటీఎం కేంద్రాల్లో లైన్లు వద్దు... డిజిటల్ లావాదేవీలు ముద్దు
బ్యాంకుల్లో పని చేసే సిబ్బంది సగానికి తగ్గించామన్నారు. రద్దీని తగ్గించేందుకు ఈ మేరకు చర్యలు చేపట్టినట్టు ఆయన వివరించారు. ప్రధానంగా ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, క్రిడెట్, డెబిట్ కార్డులతోపాటు యుపీఐ విధానాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఏటీఎంల లావాదేవీలపై చార్జీలను కూడా రద్దు చేశాయన్నారు. బాధ్యత కల్గిన పౌరులు తమ వినతులను మన్నించి డిజిటల్ లావాదేవీల వైపు మొగ్గు చూపాలని కోరారు.
ఇదీ చూడండి :కాలినడకన మధ్యప్రదేశ్‌కు పయనం