హైదరాబాద్లోని పలు రెస్టారెంట్లు, పబ్బుల్లో పనిచేస్తూ ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి నగదు చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
రూ.10లక్షల నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, క్లోనింగ్ యంత్రాలు స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని వివరించారు. ఇప్పటి వరకు 140 ఏటీఎం కార్డులను నిందితులు క్లోనింగ్ చేసినట్లు గుర్తించామన్నారు.