తెలంగాణ

telangana

ETV Bharat / state

'నా సొంత ఖర్చులతో చికిత్స చేయించుకుంటాను... అనుమతివ్వండి' - మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు లేదా విజయవాడలోని ఏదైనా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి సొంత ఖర్చులతో చికిత్స చేయించుకునేందుకు వీలుగా ఆదేశాలు జారీచేయాలని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశముంది.

atchannaidu petetion in andhrapradesh high court
'నా సొంత ఖర్చులతో చికిత్స చేయించుకుంటాను... అనుమతివ్వండి'

By

Published : Jul 3, 2020, 8:14 AM IST

'జూన్ 11న నాకు శస్త్ర చికిత్స జరిగింది. 12వ తేదీన అనిశా అధికారులు అరెస్టు చేసి ఇబ్బందికర పరిస్థితుల్లో కారులో కూర్చొబెట్టి 600 కిలోమీటర్లు ప్రయాణం చేయించారు. అనిశా కేసుల ప్రత్యేక న్యాయాధికారి ముందు హాజరుపరచగా.. జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. జూన్ 13న గుంటూరు జీజీహెచ్​కు తరలించారు. 17వ తేదీన రెండోసారి శస్త్రచికిత్స చేశారు. ఆరోగ్య సమస్యలు తలెత్తగా మంచం నుంచి కదిలే పరిస్థితి లేదు.

ఈ నెల 1న బెయిల్ దరఖాస్తుపై అనిశా కోర్టు విచారణ జరిపింది. నిర్ణయాన్ని వాయిదా వేసింది. అదే రోజు సాయంత్రం నన్ను ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేశారు. అనిశా కోర్టు అనుమతి తీసుకోకుండానే విజయవాడ సబ్​ జైలుకు తరలించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జైలుకు తరలించడం సరికాదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకునే నిమిత్తం అనుమతివ్వండి ' అని అచ్చెన్నాయుడు పిటిషన్​లో కోరారు.

ఇదీ చదవండి:సీఎం కేసీఆర్​కు లేఖ రాసిన బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details