తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్‌ కార్యక్రమం.. హాజరుకాని బీఆర్​ఎస్, కాంగ్రెస్, వామపక్ష నేతలు - బండి సంజయ్ తాజా వార్తలు

At Home program in Raj Bhavan: రిపబ్లిక్ దినోత్సవం రోజు ఏటా నిర్వహించే ఎట్ హోం కార్యక్రమం రాజ్​భవన్​లో సందడిగా సాగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, టీడీపీ విపక్ష నేతలు హాజరుకాగా.. బీఆర్​ఎస్, కాంగ్రెస్, వామపక్షాల నుంచి ఎవరూ హాజరుకాలేదు.

At Home program
At Home program

By

Published : Jan 26, 2023, 10:43 PM IST

At Home program in Raj Bhavan: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్​లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆహ్వానం మేరకు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలపై ఇవాళ జరిగిన విషయాలన్నీ అందరికి తెలుసని.. దీనిపై కేంద్రానికి నివేదిక పంపినట్లు గవర్నర్ తెలిపారు.

అధికార బీఆర్​ఎస్​తో పాటు కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు ఎవరూ ఎట్​ హోం కార్యక్రమానికి హాజరు కాలేదు. రాజకీయ పార్టీల నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ నేతలు, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, ఉన్నతాధికారులు, విశ్రాంత అధికారులు హాజరయ్యారు.

అవార్డు గ్రహీతలు, ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి అన్ని విషయాలు అందరికీ తెలుసన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... జరిగిన పరిణామాలపై కేంద్రానికి నివేదిక పంపినట్లు తెలిపారు.

రాజ్​భవన్​లో ఉదయం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా బీఆర్​ఎస్ నేతలు, ప్రభుత్వ పెద్దలూ ఎవరూ హాజరుకాలేదు. సీఎస్, డీజీపీ మాత్రమే హాజరయ్యారు. ఉదయం తన ప్రసంగంలో కేసీఆర్‌ సర్కారు తీరుపై గవర్నర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొత్త భవనాలు నిర్మించడమే అభివృద్ధి కాదని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కును కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్‌ కార్యక్రమం.. హాజరుకాని బీఆర్​ఎస్, కాంగ్రెస్, వామపక్ష నేతలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details