At home in Raj Bhavan: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై తేనీటి విందు ఇచ్చారు. ఈ వేడుకకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హాజరయ్యారు. పలు పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఎట్ హోం కార్యక్రమానికి కేసీఆర్ వెళతారని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఆయన వెళ్లలేదు. మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు కూడా కనిపించలేదు.
రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం, హాజరు కాని సీఎం కేసీఆర్ - రాజ్‌భవన్‌కు వెళ్లని సీఎం కేసీఆర్
At home in Raj Bhavan స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మంత్రులు, తెరాస నేతలు ఎవరూ హాజరుకాలేదు.
governor
సీఎం గైర్హాజరుపై గవర్నర్ స్పందించారు. సీఎం కేసీఆర్ సాయంత్రం 6.50కి వస్తారని సీఎంవో నుంచి సమాచారం వచ్చింది. తాను, హైకోర్టు సీజే సీఎం కోసం ఎదురుచూసినట్లు గవర్నర్ తెలిపారు. అయితే కేసీఆర్ ఎందుకు రాలేదో తెలియదన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై కేసీఆర్ లేఖ రాశానని తమిళి సై తెలిపారు. విద్యార్థులకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాలనేది తన ఉద్దేశ్యమని వివరించారు.
ఇవీ చదవండి..
Last Updated : Aug 15, 2022, 10:54 PM IST