పెద్దగా కరోనా లక్షణాలు లేకుండా, ఇంట్లోనే ప్రత్యేక గది సౌకర్యం ఉన్న బాధితులకు అక్కడే ఉంచి చికిత్స అందించాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కొన్ని రోజులుగా వెలుగు చూసున్న కొవిడ్ కేసుల్లో ఎక్కువ మందిని ఇంట్లోనే ప్రత్యేకంగా ఉంచి తదనుగుణంగా చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురు వేగంగా కోలుకుంటున్నారు.
తీవ్రత తక్కువ ఉన్నవారికి
కరోనా బాధితుల్లో జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతాయి. తాజాగా వస్తున్న కేసుల్లో వీటిలో అన్ని లక్షణాలు లేకపోవడం, ఉన్నా.. తీవ్రత తక్కువగా ఉన్నవారికి ఇలా చికిత్స అందిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే అప్పటికప్పుడు ఆసుపత్రికి తరలిస్తున్నారు.
హోం ఐసోలేషన్ కిట్‌లో ఉండేవి..
- 50 ఏళ్లలోపు ఉన్న వారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు
- మల్టీవిటమిన్ మాత్రలు
- విటమిన్ -సి
- పారాసిటమాల్
- అజిత్రోమైసిన్(దగ్గు, జలుబు ఉంటే)
- మాస్క్, శానిటైజర్