- మేషం
అశ్విని, భరణి, కృతిక 1వ పాదం
ఆదాయం 8; వ్యయం 14
రాజపూజ్యం 4; అవమానం 3
ఈ రాశి వారికి ప్లవ నామ సంవత్సరంలో గురు బలం సంపూర్ణంగా ఉంది. పేరుప్రతిష్ఠలు వస్తాయి. విజయం వరిస్తుంది. శత్రుదోషం తొలగుతుంది. జ్ఞాన లబ్ధి, ఆర్థికాభివృద్ధి, కార్యసిద్ధి ఉంటాయి. తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. ఆపదలు తొలగిపోతాయి. పది మందికి బాసటగా నిలుస్తారు. గత వైభవం సిద్ధిస్తుంది. అభీష్టసిద్ధి త్వరగా కలుగుతుంది. ఆశయాలు నెరవేరతాయి. సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఎదురు చూస్తున్న అంశాల్లో పురోగతి ఉంటుంది. విద్యార్థులకు విద్యావిషయంలో మంచి లాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభం జరుగుతుంది. భూ-గృహ-వాహన యోగాలు కలిసివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. స్థిరమైన ఫలితాలు వస్తాయి. ధైర్యంగా ఆటంకాలను అధిగమించి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిరుత్సాహాన్ని దరికి రానీయవద్దు. కుటుంబ సభ్యుల సహకారం చాలావరకు కార్యసిద్ధినిస్తుంది. కుటుంబపరంగా అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని విషయాల్లో ఆటంకాలు శాశ్వతంగా దూరమవుతాయి. స్థిరమైన జీవితం ఏర్పడుతుంది. మంచి వార్తలు వింటారు. అధికార యోగం సిద్ధిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శని, రాహు, కేతు శ్లోకాలు చదువుకోవాలి.
- వృషభం
కృతిక 2, 3, 4 పాదాలు; రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆదాయం 2; వ్యయం 8;
రాజపూజ్యం 7; అవమానం 3
ఈ రాశి వారికి గ్రహబలం తక్కువగా ఉంది. శ్రమ అధిక మవుతుంది. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. అనుకున్న లక్ష్యాన్ని చేరేవరకూ శ్రమిస్తూనే ఉండండి. మొహమాటం ఇబ్బంది పెడుతుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలి. పనితీరును మెరుగుపరుచుకోవటం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. ఒత్తిడిని తట్టుకుంటూ ముందుకు సాగాలి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి వస్తుంది. ఆత్మీయుల సూచనలు శక్తినిస్తాయి. వ్యయం పెరగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో స్వయంకృషి అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గురు, శని శ్లోకాలు చదువుకోవాలి. ధర్మం సదా రక్షిస్తుంది, ధైర్యంగా ముందుకుసాగండి.
- మిథునం
మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం 5; వ్యయం 5;
రాజపూజ్యం 3; అవమానం 6
ఈ రాశి వారికి అర్థ లాభం, యశోవృద్ధి లభిస్తాయి. ముఖ్యమైన కార్యాల్లో విజయం లభిస్తుంది. భూ, గృహ, వాహన లాభాలు ఉన్నాయి. విద్యార్థులకు చక్కని విద్యాయోగం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరమైన ఫలితాలు లభిస్తాయి. కాలం అన్నివిధాలా సహకరిస్తుంది. కొందరి వల్ల నిరాశ ఎదురవుతుంది. ఆశయం త్వరగా నెరవేరడం ఉత్సాహాన్నిస్తుంది. పట్టువిడుపులతో ముందుకుసాగండి. కుటుంబసభ్యుల సలహాలు అవసరమవుతాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. వివాదాల జోలికి పోవద్దు. శాంతచిత్తంతో సంభాషించండి. గృహ నిర్మాణపనుల్లో పురోగతి ఉంటుంది. ఆదాయమార్గాలు పెరుగుతాయి. శని, రాహు శ్లోకాలు చదువుకోవాలి. శివారాధన మంచిది.
- కర్కాటకం
పునర్వసు 4 వ పాదం; పుష్యమి, ఆశ్లేష
ఆదాయం 14; వ్యయం 2;
రాజపూజ్యం 6; అవమానం 6
ఇష్టకార్యసిద్ధి ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ అవసరం. అడుగడుగునా ఆటంకాలెదురవుతాయి. ధర్మబుద్ధితో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి. ఆర్థిక విషయాల్లో శ్రద్ధ అవసరం. ముందస్తు ప్రణాళిక ద్వారా కష్టాలను అధిగమించవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మోసం చేసేవారున్నారు. గతానుభవంతో పనిచేస్తే నష్టాన్ని నివారించవచ్చు. విద్యార్థులకు మిశ్రమ ఫలితం ఉంది. ఏకాగ్రతను పెంచితే ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. బాధ్యతలను సమర్థంగా నిర్వహించండి. ఓర్పు, సహనం అవసరం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఒత్తిడిని అధిగమించాలి. శని, గురు శ్లోకాలు చదువుకోవాలి. శివారాధన విజయాన్నిస్తుంది.
- సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం 2; వ్యయం 14;
రాజపూజ్యం 2; అవమానం 2
విశేషమైన శుభాలు ఉన్నాయి. శ్రమ ఫలిస్తుంది. మనోభీష్ట సిద్ధి కలుగుతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్నీ విజయంగా మార్చుకుంటే జీవితంలో పైకి వస్తారు. ఆర్థికంగా కలిసివస్తుంది. స్థిర, చరాస్తులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులుంటాయి. వ్యాపారం కలిసివస్తుంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. మీవల్ల కొందరికి మేలు చేకూరుతుంది. సమష్టి నిర్ణయాలు విజయాన్నిస్తాయి. వాస్తవానికి దగ్గరగా ఆలోచించి పని చేయండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేయండి. ధర్మదేవత మిమ్మల్ని సదా కాపాడుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. గురు, కేతు శ్లోకాలు చదువుకోవాలి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
- కన్య
ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం 5; వ్యయం 5
రాజపూజ్యం 5; అవమానం 2
కన్యారాశి వారికి పట్టుదల చాలా అవసరం. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచి ఏకాగ్రచిత్తంతో పని చేస్తేనే విజయం వరిస్తుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సకాలంలో పనులు పూర్తిచేయాలి. ధర్మచింతనతో బాధ్యతలని నిర్వర్తించండి. చిన్న పొరపాటు జరిగినా సమస్య జటిలమవుతుంది. సొంత నిర్ణయాలు శక్తినిస్తాయి. కుటుంబసభ్యుల సలహాతో ముందుకు సాగండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. బుద్ధిబలంతో ఆటంకాలను అధిగమించాలి. విద్యార్థులు పట్టుదలతో అభ్యసించాలి. వ్యయం పెరగకుండా చూసుకోవాలి. పట్టు విడుపులతో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మొహమాటం ఇబ్బంది కలిగిస్తుంది. నిరుత్సాహాన్ని దరిచేరనివ్వవద్దు. ఆశయ సాధనకు నిరంతరమైన ప్రయత్నం సాగాలి. సమాజ శ్రేయస్సు కోరి చేసే పనుల్లో దైవానుగ్రహం సిద్ధిస్తుంది. గురు, శని, రాహు శ్లోకాలు చదువుకోవాలి.
- తుల