కరోనా కారణంగా తగ్గిన ఆదాయాన్ని పెంచుకొనేందుకు... అందుబాటులో ఉన్న అన్నీ వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా ఆర్టీసీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా గత ఆరేళ్లుగా ప్రైవేటు ఆధ్వర్యంలో కొనసాగుతున్న బస్‌పాసుల జారీ ప్రక్రియను సంస్థ తన అధీనంలోకి తీసుకుంది. గతేడాది బస్‌పాసుల జారీతో 3 కోట్ల36 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు డ్రైవింగ్ పాఠశాలలకు అనుమతి లభించింది. ఆర్టీసీ ఆధ్వర్యంలో శిక్షణ ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందనే విశ్వాసంతో యువత నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి.
మన్ననలు పొందుతోంది
సమ్మె అనంతరం కార్గో సేవలు ప్రారంభించిన ఆర్టీసీ అతి తక్కువ సమయంలోనే ప్రజల మన్ననలు పొందుతోంది. ప్రైవేటు కొరియర్లతో పోలిస్తే ఛార్జీలు తక్కువగా ఉండటం.. తక్కువ సమయంలోనే గమ్యానికి చేరుకొనే అవకాశం ఉండటం వల్ల... ప్రజలు ఆర్టీసీ పట్ల ఆకర్షితులవుతున్నారు. కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహిళలకు కొరియర్‌తోపాటు కార్గో సేవలు అప్పగించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ కారణంగా సర్వీసులు రద్దయి ఇబ్బందులు పడ్డ తమకు ఇప్పుడు చేతినిండా పనిదొరుకుతోందని అంటున్నారు.