తెలంగాణ

telangana

ETV Bharat / state

'విత్తనోత్పత్తిలో తెలంగాణ అందరికీ ఆదర్శం కావాలి'

నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణ కేంద్రం కావాలన్నారు సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి. హైదరాబాద్​లో విత్తన ఔత్సాహిత పారిశ్రామిక వేత్తల సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఇష్టాకాంగ్రెస్​

By

Published : Jun 24, 2019, 7:50 PM IST

Updated : Jun 24, 2019, 9:00 PM IST

తెలంగాణ విత్తన భాండాగారంగా మారాలన్న స్పీకర్​

హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఇస్టా - విత్తన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సుకు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, సౌత్ - సౌత్ కో-ఆపరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సదస్సులో... దక్షిణాదిలో విత్తనోత్పత్తి, నాణ్యతా నియంత్రణ, మార్కెటింగ్‌ అంశాలపై చర్చించారు. సదస్సుకు రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కోటేశ్వరరావు, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్ధసారథి, కమిషనర్ రాహుల్ బొజ్జా హాజరయ్యారు. విత్తనోత్పత్తిలో రాష్ట్రంలో దేశానికి ఆదర్శం కావాలని సభాపతి పోచారం ఆకాంక్షించారు.

Last Updated : Jun 24, 2019, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details