Assembly sessions: ఈనెల 6 నుంచి శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయసభల సమావేశాలు ప్రారంభమవుతాయి. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ సమావేశాల్లో కీలక ప్రకటనలు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. శాంతిభద్రతలు, ఇటీవల వరదలపై సభలో చర్చ జరిగే అవకాశముంది.
Assembly sessions: ఆరో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. - తెలంగాణ అసెంబ్లీ
Assembly sessions: ఈ నెల ఆరో తేదీ నుంచి శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పదకొండున్నర గంటలకు సమావేశాలు మొదలవనున్నాయి. అదే రోజు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై బీఏసీ భేటీ నిర్ణయించనుంది.
సెప్టెంబర్ 3న కేబినెట్ భేటీ: సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శాసనసభ సమావేశాల నిర్వహణపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ సమావేశాలు మార్చి 15న ముగిశాయి. దీంతో సెప్టెంబర్ 14వ తేదీలోపు సభ మళ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాల నిర్వహణపై కేబినెట్లో చర్చించి తేదీలు ఖరారు చేస్తారు. వీటితో పాటు ఇతర పాలనాపరమైన అంశాలపైనా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఇవీ చదవండి:'అది నిరూపిస్తే రాజీనామా చేస్తా..' నిర్మలాసీతారామన్‌కు హరీశ్ సవాల్..