బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకుని అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పక్కా కార్యాచరణతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే విషయంలో కాంగ్రెస్ శాసనసభ్యులు మండిపడ్డారు. ప్రసంగంలో ఉన్న డొల్లతనాన్ని ఎత్తిచూపి, తెరాస వైఫల్యాలను తూర్పారబట్టేందుకు యత్నించారు. తీవ్రంగా స్పందించిన అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ పార్టీని నిలువరించే ప్రయత్నం చేశారు.
మాటల యుద్ధం..
విమర్శలు, సద్విమర్శలు చేసుకోవడం రెండు పార్టీల మధ్య తీవ్రత పెరిగి మాటల యుద్ధానికి దారితీస్తోంది. అసెంబ్లీని పక్కదారి పట్టేంచే విధంగా.. మాట్లాడే సభ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెరపైకి తీసుకురావడం, తన ప్రసంగానికి అడ్డుతగులుతున్నాడన్న కోపంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సీఎం గట్టిగా స్పందించారు. ఈ సందర్భాలను బట్టి చూస్తే... కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసే విమర్శలను ఎక్కడక్కడ తిప్పి కొట్టేందుకు తెరాస సిద్ధంగా ఉందన్న సంకేతాలను స్వయంగా ముఖ్యమంత్రినే పంపినట్లయింది.
నువ్వా.. నేనా..
శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేనిపోని విమర్శలు చేసి... సభను పక్కదోవ పట్టించేందుకు యత్నిస్తే... కఠినంగా ముందుకు వెళ్లాలన్న దిశలో అధికార పార్టీ ఉంది. అసెంబ్లీ లోపల... బయట జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్... తాము చేసే ఏ విమర్శ కూడా ఆధారాలు లేకుండా ఉండకూడదని భావిస్తోంది.
పద్దులపై లోతైన అధ్యయనం..