రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి, నియంత్రణ చర్యలు, చికిత్స సహా సంబంధిత అంశాలపై బుధవారం శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. సెప్టెంబర్ 9 నుంచి ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలు ప్రారంభం కానుండగా కరోనా కారణంగా బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రశ్నల సంఖ్యను కుదించారు. ఎక్కువ మంది అధికారులు ఉండరాదన్న ఉద్దేశంతో... ప్రశ్నల సంఖ్య 10 నుంచి 6కు తగ్గించారు.
కరోనాపై స్వల్పకాలిక చర్చ... ఆరుకు తగ్గిన ప్రశ్నల సంఖ్య
బుధవారం నుంచి ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలు ప్రారంభం కానుండగా కరోనా కారణంగా బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రశ్నల సంఖ్యను కుదించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో కల్యాణ లక్ష్మి, టీ-హబ్, వక్ఫ్ భూముల సర్వే, వర్షాలతో దెబ్బతిన్న రహదార్లకు మరమ్మత్తులు, చేపపిల్లల పంపిణీ, నల్లమల అటవీప్రాంతంలో ఎకోటూరిజం అభివృద్ధి అంశాలు చర్చకు రానున్నాయి.
కరోనాపై స్వల్పకాలిక చర్చ... ఆరుకు తగ్గిన ప్రశ్నల సంఖ్య
శాసనసభ ప్రశ్నోత్తరాల్లో కల్యాణ లక్ష్మి, టీ-హబ్, వక్ఫ్ భూముల సర్వే, వర్షాలతో దెబ్బతిన్న రహదార్లకు మరమ్మత్తులు, చేపపిల్లల పంపిణీ, నల్లమల అటవీప్రాంతంలో ఎకోటూరిజం అభివృద్ధి అంశాలు చర్చకు రానున్నాయి. శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో వ్యవసాయ యాంత్రీకరణ, హరితహారం, కొవిడ్ ఔషధాలు, గ్రామాల్లో బీటీ రహదారుల నిర్మాణం, తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకం, ప్రభుత్వ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతం అంశాలు చర్చించనున్నారు.