తెలంగాణ

telangana

ETV Bharat / state

నోముల సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి రావడం బాధాకరం: కేసీఆర్ - telangana news updates

మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతికి శాసనసభ సంతాపం ప్రకటించింది. శాసనసభలో సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. నోముల సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి రావడం బాధాకరమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన కేసీఆర్
శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన కేసీఆర్

By

Published : Mar 16, 2021, 10:58 AM IST

Updated : Mar 16, 2021, 6:39 PM IST

మాజీ ఎమ్మెల్యేనోముల నర్సింహయ్య మృతికి శాసనసభ సంతాపం ప్రకటించింది. దివంగత సభ్యులు నోముల నర్సింహయ్య మృతిపట్ల సంతాపం తెలుపుతూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ సహా మంత్రులు, ఇతర సభ్యులు దివంగత నేతను గుర్తు చేసుకున్నారు. నోముల నర్సింహయ్య మృతికి సంతాపం తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. రాష్ట్రానికి నర్సింహయ్య చేసిన సేవలను కొనియాడారు.

నోముల సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి రావడం బాధాకరమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి సందర్భం వస్తుందని తాను భావించలేదని వెల్లడించారు. నోముల నర్సింహయ్య వ్యక్తిగతంగా కూడా మంచి మిత్రులని గుర్తు చేశారు. చాలా సంవత్సరాలు నోముల నర్సింహయ్యతో కలిసి పనిచేసినట్లు తెలిపారు. తనకు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని ఉందని చెప్పారని స్పష్టం చేశారు. నోముల నర్సింహయ్య ఉద్యమశీలి, ప్రజానాయకుడని కొనియాడారు. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపించారని వ్యాఖ్యానించారు.

పోరాటాల పురిటిగడ్డ నల్గొండ చైతన్యాన్ని పుణికిపుచ్చుకున్నారని కితాబిచ్చారు. బడుగు బలహీనవర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. విద్యార్థిగా, న్యాయవాదిగా, కమ్యూనిస్ట్ నేతగా ప్రజాసేవలో గడిపారని వెల్లడించారు. శాసనసభ్యుడిగా నోముల నిరంతరం ప్రజాసేవలోనే గడిపారని గుర్తు చేశారు. 1956 జనవరి 9న నల్గొండ జిల్లా పాలెంలో నోముల జన్మించారని... విద్యార్థి దశ నుంచి ఉద్యమాలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు. పేదల పక్షం వహించి ప్రజా న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు.

నోముల సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి రావడం బాధాకరం: కేసీఆర్
Last Updated : Mar 16, 2021, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details