వృద్ధిలో దేశానికే ఆదర్శం - SESSIONS
కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా... వృద్ధి రేటులో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తాము అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే... ఇంతటి వృద్ధి సాధించగలిగామని హర్షం వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాల వల్లే...
2018-19 కి గానూ గతంలోని రాష్ట్ర వృద్ధిరేటు కంటే రెండు రెట్లు ఎక్కువగా నమోదైందని ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అనతి కాలంలోనే చెప్పుకోదగ్గ వృద్ధి సాధించటం ప్రభుత్వ పనితీరుకి నిదర్శనమని అన్నారు. ప్రస్తుత ఏడాది జీఎస్‌డీపీ వృద్ధిరేటు 10.9 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపిన సీఎం... తలసరి ఆదాయం రూ.2.06 లక్షలకు చేరుకోనుందని ధీమా వ్యక్తం చేశారు.
Last Updated : Feb 22, 2019, 3:33 PM IST