అసెంబ్లీ సమావేశాలపై సమీక్షా
ఈ నెల 22 నుంచి 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. శాసనసభపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమావేశానికి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, సీపీ అంజనీ కుమార్, ట్రాఫిక్ డీసీపీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. శాసనసభ సమావేశాల భద్రతపై చర్చించారు.
శాంతియుతంగా జరిగేలా చూడాలి
శాసనసభ సమావేశాలు ప్రశాంతంగా జరగడంలో పోలీస్శాఖది కీలక బాధ్యతని.. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ సూచించారు. శాంతియుతంగా జరపడానికి అందరి సహకారం అవసరమని తెలిపారు.
ముఖ్యమంత్రి, మంత్రులు... శాసన సభ్యులు మండలి సభ్యులు రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, సభ్యుల భద్రతకు చర్యలు తీసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొన్నారు.
శాసనసభ సజావుగా జరగడానికి అవసరమైన సహాయ, సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలకు భద్రత - meeting
అసెంబ్లీ సమావేశాలపై అధికారులతో సభాపతి సమీక్ష నిర్వహించారు. భద్రత, ఇతర ఏర్పాట్లపై సూచనలు చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు సమీక్ష
ఇవీ చదవండి:'ఐదేళ్లలో అంబరమెక్కిస్తా'